పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాదులోని గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ ను నిర్వహించారు. అలాగే పవన్ కళ్యాణ్, శ్రీలీల..ల పై ఓ మానిటైజ్ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. మరో 2 వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.
దీంతో ‘ఉస్తాద్..’ కి సంబంధించిన కీలక షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరో కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా కీలక పాత్రకి ఎంపికైనట్టు తెలుస్తుంది. ‘స్కంద’ బ్యూటీ సాక్షి వైద్యని ముందుగా ఓ కీలక పాత్రకి అనుకున్నారు.
కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్టు టాక్ నడుస్తుంది. ఆమె ప్లేస్ లో ఇప్పుడు రాశీ ఖన్నాని తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. ‘థాంక్యూ’ తర్వాత రాశీ ఖన్నా నుండి సినిమా రాలేదు. సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్..’ లో సెలెక్ట్ అయితే మళ్ళీ ఈమె పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ – హరీష్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.