పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా..!

2019 ఎండింగ్లో ‘వెంకీమామ’ ‘ప్ర‌తీరోజు పండ‌గే’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుంది రాశీ ఖన్నా.దాంతో అటు తరువాత విజయ్ దేవరకొండతో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ఈమె హ్యాట్రిక్ కొడుతుంది అని అంతా అనుకున్నారు. ఆ చిత్రంలో చేసిన ‘యామిని పాత్ర తన కెరీర్లోనే బెస్ట్’ అని రాశీ చెప్పుకొచ్చింది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆ చిత్రం విజయం సాధించలేదు. ప్ర‌స్తుతం రాశీ త‌మిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

లాక్ డౌన్ వల్లనో ఏమో కానీ తెలుగులో ప్రస్తుతానికైతే ఈమె మరో చిత్రం చెయ్యడం లేదు. కానీ వరుస ఫోటోషూట్లతో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి విషయం పై ఓ క్లారిటీ ఇచ్చేసింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “ప్ర‌స్తుతానికి నేను సింగిలే..! నా జీవితంలో ఎవ్వరూ లేరు. నన్ను అర్ధం చేసుకుని.. కేరింగ్ గా చూసుకునే వ్యక్తి ఇంకా దొరకలేదు. ఒక వేళ అలాంటి వ్య‌క్తి నా లైఫ్‌లోకి వ‌స్తే మాత్రం కచ్చితంగా అతనితో డేటింగ్‌ కు వెళ్తా..!

కరోనా లాక్‌డౌన్ టైములో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. రానా పెళ్లి ఫొటో చూసాక అయితే నేను షాక‌య్యాను. ఇప్పటికీ ఆ క్షణాన్ని మరిచిపోలేదు. నా మ‌దిలో మెదులుతూనే ఉంది. నితిన్, కాజ‌ల్ కూడా త‌మ సోల్‌మేట్‌ల‌ని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు. నా లైఫ్ లో కూడా అలాంటి మంచి రోజు వ‌స్తుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌స్తుతానికైతే వ‌ర్క‌వుట్లు చెయ్యడం.. నిద్ర‌పోవ‌డం వంటివి తప్ప మరో ధ్యాస లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus