Raashi Khanna: రాశిఖన్నా డేటింగ్ విషయంపై ఫన్నీగా స్పందించిన చైతన్య?

  • July 11, 2022 / 12:41 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాసి ఖన్నా తన డేటింగ్ విషయం గురించి బయట పెట్టారు.తాను డేటింగ్ వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని గతంలో పలుసార్లు చెప్పడంతో మీరు ఎవరితో డేటింగ్ వెళ్లాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రాశిఖన్నా సమాధానం చెబుతూ. తాను యాక్టర్ కాకపోయి ఉంటే ఐ ఏఎస్ కావాలనేదే తన లక్ష్యంగా ఉండేదని వెల్లడించారు. తాను స్కూల్లో కూడా మంచి టాపర్ అనే విషయాన్ని వెల్లడించారు.

ఇకపోతే తాను డేటింగ్ చేయాల్సి వస్తే ఒక డాక్టర్ తో డేటింగ్ కి వెళ్తానని ఈమె పేర్కొన్నారు.ఈ విధంగా ఈమె డాక్టర్ తో డేటింగ్ వెళ్లాలి అనుకుంటున్నాను అని చెప్పగానే వెంటనే నాగచైతన్య స్పందిస్తూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. డాక్టర్లు ఇది విన్నారా తనకు డాక్టర్ తో డేటింగ్ చేయాలని ఉందట. ఈ విషయం తెలిస్తే డాక్టర్లందరూ హాస్పిటల్ మూసేసి రాసి ఖన్నా ఇంటి ముందు క్యూగా నిలబడతారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిట్ చాట్ సందర్భంగా రాసి ఖన్నా తనకు ఇష్టమైన ఫుడ్, కార్ల గురించి కూడా ప్రస్తావించారు. మొత్తానికి వీరిద్దరితో కలిసి నిర్వహించిన ఈ చిట్ చాట్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి జులై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus