Raashii Khanna: ఆ హీరోలంటే ఎక్కువ ఇష్టమన్న రాశీఖన్నా!

ఊహలు గుసగుసలడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీఖన్నాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో నటిస్తున్నారు. తమిళంలో సర్దార్, అరణ్మనై సినిమాలలో నటిస్తున్న రాశీఖన్నా తెలుగు, తమిళంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రాశీఖన్నా తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పుకొచ్చారు.

అందరు హీరోలు తనకు ఇష్టమేనని సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరింత ఎక్కువ ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ డ్యాన్స్ కు తాను వీరాభిమానినని రాశీఖన్నా కామెంట్లు చేయడం గమనార్హం. హీరోయిన్ల విషయానికి వస్తే సమంత, అనుష్క తనకు ఇష్టమని రాశీఖన్నా అన్నారు. అనుష్క శెట్టి, సమంతలా నటించాలని ఉందని రాశీఖన్నా చెప్పుకొచ్చారు. రాశీఖన్నా తన ఫేవరెట్ హీరోలలో ఒకరైన తారక్ తో జై లవకుశ సినిమాలో నటించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో సైతం ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 5 సినిమాలలో నటిస్తూ ఉండటం గమనార్హం. థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలతో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంటానని రాశీఖన్నా అనుకుంటున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus