Raasi, Balakrishna: ఫ్లాష్ బ్యాక్.. బాలయ్యకి రాశి ‘నో’ ఎందుకు చెప్పిందంటే..?

నందమూరి బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరెకెక్కిన సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ ఒకటి. తొంబైలలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1999 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పదహారు కోట్లు వసూలు చేసింది. కొన్ని థియేటర్లలో రెండొందల రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా విడుదలై 23 ఏళ్లు గడుస్తోంది.

ఈ సందర్భంగా గతంలో ఈ హిట్ సినిమాపై సీనియర్ నటి రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో ముందుగా రాశిని హీరోయిన్ గా అనుకున్నారట. అయితే రాశి మాత్రం ఈ సినిమాకి నో చెప్పినట్లు తెలుస్తోంది. దానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. బి.గోపాల్ తనను సంప్రతి కథ వినిపించారట. అయితే ఆ సినిమాలో ఓ సన్నివేశం నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద సినిమాను వదులుకుందట.

అది సీతాకోకచిలుక సీన్ అని వెల్లడించింది రాశి. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడట. ఆమెకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందట. అలా రాశి స్థానంలో సిమ్రాన్ వచ్చి చేరింది. బాలయ్య సినిమాను రాశి రిజెక్ట్ చేయడంతో అప్పట్లో ఓ వర్గం నుంచి రాశి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది. అమ్మ, వదిన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus