Raayan Twitter Review: ‘రాయన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ధనుష్ (Dhanush) కెరీర్లో 50 వ సినిమాగా రూపొందింది ‘రాయన్’ (Raayan) . ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే దీనిని ధనుష్ డైరెక్ట్ చేయడం. అలాగే ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ధనుష్ తో పాటు ఈ చిత్రంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) , కాళిదాస్ జయరామ్ (Kalidas Jayaram) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి. జూలై 26న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘రాయన్’ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుందట. సస్పెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయట. ఇంటర్వెల్ బ్లాక్ కూడా మెప్పిస్తుందని అంటున్నారు. ఇక సెకండాఫ్ మొదట్లో కొంత బోర్ కొట్టించినప్పటికీ సస్పెన్స్ ను బాగానే మెయింటైన్ చేశారట.

క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగిందట. ధనుష్ ఎప్పటిలానే బాగా నటించాడట. సందీప్ కిషన్ రోల్ కూడా చాలా బాగా వచ్చిందట.అపర్ణ బాలమురళి (Aparna Balamurali), కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్  (Selvaraghavan) ,..ల నటన కూడా అలరిస్తుందని అంటున్నారు. మొత్తంగా ‘రాయన్’ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగానే ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus