‘ఇద్దరమ్మాయిలతో’ వంటి ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘రేసుగుర్రం’ (Race Gurram). సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) (Nallamalupu Bujji), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించారు. అల్లు అర్జున్ కి జోడీగా శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటించగా తమన్ (S.S.Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 2014 ఏప్రిల్ 11న రిలీజ్ అయ్యింది ‘రేసు గుర్రం’. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు లేవు.
కానీ మొదటి షోతోనే సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. కిక్ శ్యామ్ (Syam) రోల్, క్లైమాక్స్ లో బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి. నేటితో ‘రేసుగుర్రం’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 17.85 cr |
సీడెడ్ | 8.30 cr |
ఉత్తరాంధ్ర | 5.10 cr |
ఈస్ట్ | 3.15 cr |
వెస్ట్ | 2.54 cr |
గుంటూరు | 3.85 cr |
కృష్ణా | 2.45 cr |
నెల్లూరు | 1.95 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 45.19 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.45 cr |
ఓవర్సీస్ | 6.65 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 59.29 కోట్లు(షేర్) |
‘రేసుగుర్రం’ చిత్రం రూ.38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఏకంగా రూ.59.29 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.21.29 కోట్ల లాభాలు అందించింది. 2014 లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 1 ప్లేస్లో నిలిచింది ‘రేసు గుర్రం’.