రేస్ టు ఫినాలే : ఏం పుల్ల పెట్టావ‌య్యా బిగ్‌సామి..!

తెలుగుటెలివిజన్‌ బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. దీంతో ఊహించ‌ని ట్విస్ట్‌లు ఉండేలా టాస్క్‌లు ఇచ్చి బిబి షోను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు ప్లాన్ వేశాడు బిగ్‌బాస్. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇక ముందు కెప్టెన్ ఎవ‌రూ ఉండ‌ర‌ని చెప్పి, కంటెస్టెంట్లు అంద‌రిని ఎలిమినేష‌న్ జోన్‌లోకి నెట్టేశాడు బిగ్‌బాస్. దీంతో ఇమ్యూనిటి ప‌వ‌న్ ఎవ‌రికీ ద‌క్కే చాన్స్ లేక‌పోవ‌డంతో రానున్న మూడు వారాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆశ‌క్తిగా మారింది.

ఇక అందరినీ ఎలిమినేషన్ జోన్‌లోకి నెట్టేసి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ హౌస్‌లో బెస్ట్ అండ్ వ‌రెస్ట్ కెప్టెన్ ఎవ‌రో తేల్చి చెప్పాల‌న్నాడు. దీంతో మ‌రోసారి హౌస్‌మేట్స్ మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ముఖ్యంగా అఖిల్ – అభిజిత్‌ల మ‌ధ్య మ‌రోసారి మాట‌ల యుధ్ధం జ‌రిగింది. హౌస్‌లో అంద‌రూ క‌ష్ట‌ప‌డి కెప్టెన్ అయితే, అఖిల్ మాత్రం ల‌క్‌తో అయ్యాడ‌ని, కుండ‌లో చెయ్యిపెట్టి కెప్టెన్ అయ్యాడ‌ని అభిజిత్ అన‌డంతో, అఖ‌ల్ త‌న‌దైన హావ‌భావాల‌తో రియాక్ష‌న్ ఇచ్చాడు.

కెప్టెన్సీ విష‌యంలో అంద‌రికంటే తానే చాల క‌ష్ట‌ప‌డ్డాన‌ని, ఇంట్లో నుండి వెళ్ళ‌డం మామూలు విష‌యం కాద‌ని, పెద్ద రిస్క్ అని, నువ్వు డైరెక్ట్‌గా చెప్ప‌కుండా సోది క‌బుర్లు చెప్పొద్ద‌ని అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వు ఎలాగైనా తిరిగి వ‌స్తావ‌ని తెలిసే రెడ్ జోన్‌లోకి వెళ్ళావ‌ని, నువ్వు రిస్క్‌లో ఉన్నావ‌నేలా మాకు అనిపించ‌లేద‌ని అభిజిత్ కౌంట‌ర్ ఇచ్చాడు. తాను ఒంటరిగా రూమ్‌లో మెంట‌ల్ టార్చ‌ర్ అనుభ‌వించాన‌ని, అఖిల్ అన్నాడు.

ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల ర‌చ్చ కొద్దిసేపు అలానే కొనాసాగింది. అయితే ల‌క్ ఫ్యాక్ట‌ర్ కార‌ణంగానే అఖిల్ కెప్టెన్ అయ్యాడ‌ని ఫైన‌ల్‌గా అభి తేల్చి చెప్పాడు. దీంతో అప్ప‌టికి అఖిల్ అండ్ అభిల మ‌ధ్య గొడ‌వకు బ్రేక్ ప‌డినా, ముందు ముందు ఇద్ద‌రి మ‌ధ్య సిట్యువేష‌న్స్ ఎలా ఉంటాయో అనేది ఆశ‌క్తిగా మారింది. ఏది ఏమైనా కాస్త కూల్‌గా ఉన్న హౌస్‌లో బిగ్‌బాస్ మ‌రోసారి త‌న‌దైన స్టైల్‌లో పుల్ల పెట్టి హౌస్‌మేట్స్ మ‌ధ్య గొడ‌వ‌పెట్టి విడ‌గొట్ట‌డంతో స‌క్సెస్ అయ్యాడు. ఇక ఈ సీజన్ రేస్ టు ఫినాలేలో అడుగుపెట్టిన నేప‌ధ్యంలో ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు బిగ్‌సామి ఇంకెన్ని పుల్ల‌లు పెడ‌తాడో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus