Prabhas: నా ఇమేజ్ డామినేట్ చేసేస్తుందని ప్రభాస్ ముందే చెప్పారు : దర్శకుడు రాధా కృష్ణ

  • March 21, 2022 / 07:35 PM IST

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యిందనే చెప్పాలి. పోటీగా సినిమాలు లేకపోవడంతో చాలా చోట్ల థియేటర్లలో ‘రాధే శ్యామ్’ ను ప్రదర్శిస్తున్నారు కానీ జనాలు అయితే ఇంట్రెస్టింగ్ గా రావడం లేదు. తొలి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ సోమవారం నుండీ ఘోరంగా పడిపోయింది.2013 లో వచ్చిన ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘మిర్చి’ సినిమాకి 10 వ రోజున నమోదైన కలెక్షన్లు కూడా ‘రాధే శ్యామ్’ కి 4వ రోజున నమోదు కాలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు.

Click Here To Watch NEW Trailer

‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మార్నింగ్ షోల నుండీ డీసెంట్ టాక్ వచ్చింది. కానీ అప్పటికే బెనిఫిట్ షోలు పడడం.. వాటి టాక్ చాలా బ్యాడ్ గా ఉండడం.. అదే అన్ని వైపులా స్ప్రెడ్ అయిపోవడంతో ఆఫ్ లైన్ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. అప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే ఈ సినిమా రిజల్ట్ ను ప్రభాస్ ముందే ఊహించినట్టు దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

‘ఈ సినిమాని మొదటి రోజు నా ఇమేజ్ డామినేట్ చేసేస్తుంది. తర్వాత పికప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు’ అన్నట్టు ప్రభాస్ తెలిపాడని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ నుండీ ఆశించే మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏమాత్రం లేకపోవడంతో ఆయన అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. వాళ్ళే టాక్ బ్యాడ్ గా చెప్పడంతో కలెక్షన్లు దారుణంగా దెబ్బ తినేసాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా రూ.114 కోట్ల నష్టంతో ‘రాధే శ్యామ్’ ఫుల్ రన్ ముగుస్తుందని ట్రేడ్ పండితులు తేల్చేసారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus