Radha Krishna: ‘రాధేశ్యామ్‌’ దర్శకుడి కొత్త సినిమా… అంత నమ్మం ఏంటో?

‘రాధేశ్యామ్‌’ సినిమా వచ్చాక రాధాకృష్ణ దర్శకత్వం విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇబ్బందిపడ్డారు కానీ… నిజానికి ఆయనకు స్టైలిష్‌ దర్శకుడి అని పేరు. అంతెందుకు ‘రాధేశ్యామ్‌’ అనౌన్స్‌ అయినప్పుడు కూడా ‘డార్లింగ్ ఎంత అందంగా చూపిస్తారో, ఎంత స్టయిలిష్‌గా చూపిస్తారో?’ అని లెక్కలేసుకున్న దర్శకుడు ఆయన. దానికి కారణం ఆయన గత సినిమా. ఆ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌. రాధాకృష్ణ కుమార్‌… ఇలా పిలిచే కంటే ‘జిల్’ రాధాకృష్ణ అంటేనే ఎక్కువమందికి తెలుస్తుంది.

గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అందుకున్న విజయం గురించి చెప్పే కంటే ఆ సినిమాతో హీరోకు వచ్చిన డిఫరెంట్‌ ఇమేజే గొప్పది అనాలి. ఒక స్టీరియో టైప్‌ పాత్రలు, లుక్‌కు ఫిక్స్ అయిపోయిన గోపీ అభిమానులు ఆ సినిమాలో కొత్తగా ఫీల్‌ అయ్యారు. అయితే ఆయనే ‘రాధేశ్యామ్‌’ తీసేసరికి ప్రభాస్‌ అభిమానులు చిరాకు ఫీలయ్యారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే… అంత తేడా సినిమా ఇచ్చినా ఆ దర్శకుడి (Radha Krishna) మీద ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఇంకా నమ్మకం పెట్టుకోవడమే.

ఆయన రచన, సినిమాను చూపించే విధానం మీద నమ్మకం పెట్టుకున్న నిర్మాతలు ఈ సారి భారీ కూడా బడ్జెట్‌ పెడుతున్నారట. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో కొత్త సినిమాను త్వరలో పట్టాలెక్కిస్తారని టాక్. అందులో హీరో గోపీచంద్‌. ఈ మాట విన్నాక గోపీచంద్‌ మీద అంత బడ్జెట్టా అనే డౌట్‌ రావొచ్చు. అయితే కథ, దాని నేపథ్యం బలంగా ఉండటంతో ఎంత పెట్టినా వచ్చేస్తాయి అని నిర్మాతలు అనుకుంటున్నారట. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా విదేశాల్లోని భారీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట.

దీని కోసమే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అంటున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రిలీజ్‌ ఉంటుంది అని చెప్పాచ్చు. ఇక గోపీచంద్ సరైన విజయం అందుకుని చాలా ఏళ్లు అయిపోయింది. చివరి సినిమా ‘రామబాణం’ దారుణమైన ఫలితాన్న అందుకుంది. త్వరలోనే ‘భీమ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ‘జిల్‌’ మనిపించే సినిమా ఉంటుందట.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus