పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ వచ్చిన రీసెంట్ మూవీ ‘రాధే శ్యామ్’. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. మార్నింగ్ షో ల నుండీ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ నమోదయినప్పటికీ అప్పటికే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో బుకింగ్స్ డౌన్ అయిపోయాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ ను ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా బాగా కల్లెక్ట్ చేసింది.
అయితే వీకెండ్ తర్వాత ఈ మూవీ పూర్తిగా చేతులెత్తేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి.
ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
24.51 cr
సీడెడ్
07.44 cr
ఉత్తరాంధ్ర
05.13 cr
ఈస్ట్
04.39 cr
వెస్ట్
03.37 cr
గుంటూరు
04.51 cr
కృష్ణా
02.73 cr
నెల్లూరు
02.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
54.24 cr
తమిళ్ నాడు
0.91 cr
కేరళ
0.49 cr
కర్ణాటక
4.36 cr
నార్త్ ఇండియా (హిందీ)
10.68 cr
ఓవర్సీస్
11.45 cr
రెస్ట్
4.28 cr
టోటల్ వరల్డ్ వైడ్
86.41 cr
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.86.41 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు భారీగా రూ.113.59 కోట్ల నష్టాలు వాటిల్లాయి.ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఈ రేంజ్ నష్టాలను మిగిల్చిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి. ‘సాహో’ అయినా కనీసం నార్త్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ఆ ఫీట్ ను కూడా సాధించలేకపోయింది.