సరికొత్త ఎమోషనల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధే శ్యామ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో తప్పితే ఈ సినిమాకు మిగతా భాషల్లో అయితే చాలా తక్కువ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రావడం లేదు. వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా డా వీకెండ్ అనంతరం ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి.
హిందీలో కూడా రాధే శ్యామ్ తీవ్ర స్థాయిలో నెగిటివ్ రివ్యూలు రావడం అంతేకాకుండా హిందీ ప్రేక్షకులు కూడా ఈసారి ప్రభాస్ ను లవ్ స్టోరీ లో అంతగా చూడలేకపోయారు. దానికి తోడు ది కశ్మీర్ ఫైల్స్ అనే మరో సినిమా నుంచి రాధే శ్యామ్ గట్టి పోటీ ఎదురయ్యింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా హడావిడి మరొక వారం రోజులు కూడా ఉండడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే త్వరలో RRR సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా వచ్చింది అంటే మిగతా సినిమాలు పక్కకు తప్పుకోవాల్సిందే. రాధే శ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగానే రావడంతో థియేటర్స్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ యువి క్రియేషన్స్ ను సంప్రదించి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కంటే మరొక డీల్ తో కాస్త ముందుగానే ఓటీటీ లో విడుదల చేసుకునే విధంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది దాదాపు రాధే శ్యామ్ హడావిడి ముగిసింది కాబట్టే కనీసం ఓటీటీలో ముందుగా అయినా రిలీజ్ చేసుకుంటే కొంతలో కొంత అమెజాన్ ప్రైమ్ నుంచి కాస్త లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 11 తర్వాతనే రాధే శ్యామ్ విడుదల చేయాలి కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మాత్రం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన రాధే శ్యామ్ ను విడుదల చేసుకునే అవకాశం కల్పించుకునే విధంగా చర్చలు జరుపుతోంది.