Radhe Shyam Trailer: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రేక్షకుల అంచనాలకు అందని ట్విస్టులు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రాధేశ్యామ్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 17వ తేదీన లేదా 17వ తేదీ తర్వాత ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం. సినిమాలోని క్లాసీ షాట్స్, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ప్రభాస్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రభాస్ నమ్మకం రాధేశ్యామ్ తో నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ప్రభాస్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తుండగా వచ్చే ఏడాది ఆ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus