₹250 ఖర్చు పెడితే ఓ సినిమా ఇంటిల్లిపాదీ చూసేయొచ్చు అంటే బంపర్ ఆఫర్ కదా. అయితే ఆ సినిమా ఇంట్లో టీవీలోనే, మొబైల్‌లోనే చూడాలి అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు బాలీవుడ్ జనాల పరిస్థితి ఇలానే తయారైంది. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ‘రాధే’ ఓటీటీలో విడుదలకాబోతోంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘పే పర్ వ్యూ’ స్టైల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా, మళ్లీ ఆ సినిమా చూడాలి అంటే డబ్బులు కట్టాలి. ఇదంతా ఒకే.. ఆ సినిమాకు చెబుతున్న ధరే ఇక్కడ ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
‘రాధే’ సినిమాను ‘జీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో కూడా వస్తుందని గతంలోనే చెప్పారు. అయితే దీని కోసం వినియోగదారుడు ₹249 చెల్లించాలి. ఓటీటీ నెలవారీ సబ్‌స్క్రిప్షనే ఆ ధరకు వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఒక సినిమా కోసం అంత చెల్లిస్తారా అనేది ప్రశ్న. దాంతోపాటు థియేటర్లలో విడుదల చేస్తేనే పైరసీ గంటల్లో వచ్చేస్తోంది. మరి ఓటీటీ అంటే నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు అంతపెట్టి సినిమా చూస్తారా. ఏమో చూడాలి మరి.
మే నెల 13న ‘రాధే’ను రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు వచ్చే ఫలితం బట్టి మిగిలిన సినిమాలు ఈ దిశగా ఆలోచించాలా వద్దా అనేది చూస్తాయి. ఎందుకంటే గతంలో ఒకసారి ‘కాలీ పీలీ’ అనే సినిమా ఇలానే పే పర్ వ్యూలో వచ్చి దెబ్బతింది. ఆ సినిమాకు ₹200 సబ్‌స్క్రిప్షన్ పెట్టినట్లు గుర్తు. మరి దానికి ₹49 ఎక్కువ పెట్టిన ఈ సినిమా ఏమవుతుందో. సల్మాన్ అభిమానులు, హార్డ్‌కోర్ ప్రేక్షకులు అయితే డబ్బులు కట్టి చూస్తారు. అయితే పైరసీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సల్మాన్ ప్లాన్ అదిరిపోతుంది. లేదంటే కష్టమే.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!