Prabhas: వామ్మో.. ప్రభాస్ సినిమా కోసం ఈ రేంజ్ ప్రమోషన్లా?

ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమాలలో రాధేశ్యామ్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా బాగానే కలెక్షన్లను సాధించగా వీకెండ్ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం రాధేశ్యామ్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ నెల 26వ తేదీన ఈ సినిమా బుల్లితెరపై జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే జీ తెలుగు ఛానల్ నిర్వాహకులు ఈ సినిమా కోసం వెరైటీగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఈ ఛానల్ నిర్వాహకులు రాధేశ్యామ్ సినిమా కోసం భీమవరంలో రాధేశ్యామ్ థీమ్ పార్క్ ను ఏర్పాటు చేశారు. రాధేశ్యామ్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను ప్రతిబింబించేలా ఈ థీమ్ పార్క్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.

రాధేశ్యామ్ బుల్లితెరపై మంచి రేటింగ్స్ సాధిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కచ్చితంగా సంతోషిస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. జీ తెలుగు ఛానల్ నిర్వాహకుల ప్రచారానికి తగ్గ ఫలితం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రేక్షకులను ఆకర్షించాలంటే కొత్తగా చేయాలనే ఆలోచనతో ఛానల్ నిర్వాహకులు ఈ తరహా ప్రచారానికి సిద్ధమయ్యారు. రాధేశ్యామ్ సినిమాను ఇప్పటివరకు చూడని ప్రేక్షకులు బుల్లితెరపై కచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus