Radhika Apte: ‘లెజెండ్’ బ్యూటీ ఏంటి ఇలా అయిపోయింది.. వైరల్ అవుతున్న ఫోటో..!

రాధికా ఆప్టే.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాంగోపాల్ వర్మ ఈమెను ‘రక్త చరిత్ర’ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసాడు… కానీ బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణతోనే ‘లయన్’ అనే మూవీలో కూడా నటించింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లోనే సినిమాలు/ వెబ్ సిరీస్ లు చేసుకుంటూ కాలం గడుపుతుంది.

Click Here To Watch NOW

ఓ సౌత్ స్టార్ హీరో ఈమెను లైంగికంగా వేధించాడు అంటూ చెప్పి ఈమె అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. గ్లామర్ రోల్స్ చేయడానికి ఈమె ఏమాత్రం వెనుకాడదు. కాకపోతే దానికి తగ్గ కథ కూడా ఉండాలంటూ ఈమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఆమె దారుణమైన లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఫోటోని కనుక గమనిస్తే ఈమెకు జుట్టు ఫుల్ గా లేదు.

సగం కట్ చేసి ఉంది. ఈమె ధరించిన దుస్తులకి కూడా దుమ్ము అంటి ఉంది.అయితే ఈ లుక్ 2016లో వచ్చిన ‘పర్‌చెద్‌’ సినిమా లోనిదట. ఈ మూవీలో రాధికా గుజరాత్‌ గ్రామీన యువతిగా కనిపించింది.ఆ మూవీలో తోటి నటుడు ఆదిల్‌ హుస్నెన్‌తో కలిసి బోల్డ్‌ సన్నివేశాల్లో నటించింది. ఆ సీన్లు అ‍ప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ సినిమా సమయంలో ఈమె తీసుకున్న ఫోటో ఇదని తెలుస్తుంది. ప్రస్తుతం రాధికా ‘విక్రమ్ వేధా’ హిందీ రీమేక్ లో నటిస్తుంది. దాంతో పాటు మోనికా, ఓ మై డార్లింగ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus