ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోని చిత్రం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు తెలుగు హిందీ సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈమె ఎక్కువగా బోల్డ్ సన్ని వేషాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే రాధిక ఆప్టే సినిమాలపరంగా కన్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.
రాధిక ఆప్టే (Actress) తనకు తోచిన విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ వివాదాలలో చిక్కుకుంటున్నారు. తాజాగా మహిళల గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమేనని చెబుతున్నారు. ఇద్దరు కూడా సమాన వేతనం తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఇంటి పనులు మాత్రం ఆడవారే చేయాలి అంటూ తెలియజేశారు.
ప్రస్తుత కాలంలో మగవారికి సమానంగా ఆడవారు సంపాదిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగం చేసుకొని ఆడవారు ఇంటికి వెళ్లి అన్ని పనులు అన్నింటిని ఆడవారే చేయాలి. ఇది ఏం సమానత్వం అంటూ ప్రశ్నించారు. నా తండ్రి గారికి హాస్పిటల్ ఉంది అందులో మా అమ్మ సేవలు చేస్తుంది. అమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే తిరిగి ఇంటి పనులన్నీ కూడా చేసేవారు. ఆడవారు ఇంటి పనులు కూడా చేయాలని వారి బాల్యం నుంచే పనులు నేర్పిస్తున్నారు.
ఈ విధంగా ఆడవారు ఇంత త్యాగం చేయాల్సిన పనిలేదు కుటుంబం అంతా కలిసి తలా ఒక పని చేస్తే బాగుంటుందని ఈమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇక గత కొద్ది రోజుల క్రితం ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే గౌరవం హీరోయిన్లకు ఇవ్వలేదని వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ హీరోయిన్లకు ఇవ్వడం లేదని రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా హక్కు కల్పించాలి అంటూ డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.