Raghava Lawrence: నన్ను మీ అన్నయ్యలా భావించండి.. లారెన్స్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ హీరో, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ నటుడిగా ఊహించని స్థాయిలో సక్సెస్ రేట్ ను పెంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకోవడానికి రాఘవ లారెన్స్ మరిన్ని అడుగులు వేస్తున్నారు. నన్ను అన్నయ్యలా భావించండని రాఘవ లారెన్స్ తెలిపారు.

రాఘవ లారెన్స్ ప్రస్తుతం జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని లారెన్స్ వెల్లడించారు. సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ప్రేమ చూపిస్తుంటారని లారెన్స్ అన్నారు. కాంచన మూవీ తర్వాత నేను నటించిన రుద్రుడు, చంద్రముఖి2 సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని లారెన్స్ తెలిపారు.

అయినా ఫ్యాన్స్ ప్రేమాభిమానాలు తగ్గలేదని లారెన్స్ కామెంట్లు చేశారు. నేను ఏ స్థాయిలో ఉన్నా ఫ్యాన్స్ హృదయాల్లోంచి మాత్రం తీయొద్దని భగవంతుడిని కోరుకుంటున్నానని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. కష్టాలు ఎదుర్కొనే దివ్యాంగులు ఉన్నా, ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయాల్సి ఉన్నా ఆ వివరాలను మాకు తెలియజేయండని లారెన్స్ పేర్కొన్నారు. తప్పకుండా వారికి సేవ చేస్తానని రాఘవ లారెన్స్ వెల్లడించారు.

జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా రిలీజ్ తర్వాత ఇక్కడ కూడా ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తానని లారెన్స్ వెల్లడించారు. మీ సమస్య తెలుసుకుని పరిష్కారం చూపించడానికి నెలలో రెండు రోజులు ఇక్కడే ఉంటానని లారెన్స్ కామెంట్లు చేశారు. లారెన్స్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. (Raghava Lawrence) లారెన్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus