రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఓ స్టూడెంట్ పై బౌన్సర్ దాడి చేశాడు. ఇదే విషయంపై రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగతంగా తనకి గొడవలు నచ్చవని ఆయన తెలిపారు. ‘‘చంద్రముఖి 2’ ఆడియో విడుదల సమయంలో ఒక బౌనర్స్, కాలేజీ స్టూడెంట్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడే నా దృష్టికి వచ్చింది.
వేడుక జరుగుతున్న సమయంలో హాల్ బయట ఈ ఘటన చోటుచేసుకోవడంతో నాకు (Lawrence) కానీ, ఫంక్షన్ నిర్వాహకులకు కానీ ఈ విషయం తెలియలేదు. స్టూడెంట్స్ అంటే నాకెంత ఇష్టమో, వాళ్లు జీవితంలో వృద్ధి చెందాలని ఎంతలా కోరుకుంటానో అందరికీ తెలుసు. ఇలాంటి కొట్లాటలకు నేను వ్యతిరేకిని. మనం వెళ్లే ప్రతి చోటు సంతోషం, శాంతితో కళకళలాడాలని కోరుకుంటా. కారణం ఏదైనా సరే ఒక వ్యక్తిని, మరీ ముఖ్యంగా ఒక స్టూడెంట్‌ను కొట్టడం తప్పు.
ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. క్షమాపణలు చెబుతున్నా. అలాగే, ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడవద్దని బౌన్సర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని లారెన్స్ ట్వీట్ పెట్టారు. 2005లో ఘన విజయాన్ని అందుకున్న ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. పి.వాసు దర్శకుడు. లారెన్స్, కంగనా రనౌత్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందించారు.
సెప్టెంబర్ 15న ఇది విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ చెన్నై వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ స్టూడెంట్‌కి, బౌన్సర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సదరు విద్యార్థిపై బౌన్సర్ దాడికి పాల్పడ్డాడు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!