నెగెటివ్ రోల్ కి లారెన్స్ ఓకే చెప్తాడా..?

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్’. కొన్నాళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నెల రోజుల షెడ్యూల్ లో కొన్ని కీలకసన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత కమల్ రాజకీయాల కోసం విరామం తీసుకున్నారు. ఆయన పార్టీ మక్కల్ నీదిమయం తమిళబాస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కమల్ ప్రచారంలో బిజీ అయ్యారు. మరో నెల రోజుల పాటు ఆయన తన రాజకీయ పనుల్లో బిజీ అయిపోతారు.

ఆ తరువాత మళ్లీ ‘విక్రమ్’ సినిమా సెట్స్ పైకి వస్తారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ని బట్టి ఇదొక యాక్షన్ ఫిలిం అనే సంగతి తెలుస్తోంది. ఇందులో కమల్ కి ధీటుగా విలన్ రోల్ ఉంటుందని సమాచారం. దీనికి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ కొన్నాళ్లుగా ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమాల్లోనే నటిస్తున్నారు. ఆయన నటించిన ‘కాంచన’ సిరీస్ చూస్తే.. నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్ కూడా బాగా చేయగలడనిపిస్తుంది.

ఆ సినిమాలు చూసే ‘విక్రమ్’ సినిమాలో విలన్ పాత్రకి లారెన్స్ ని కన్సిడర్ చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ కమల్ సినిమాలో విలన్ రోల్ అంటే లారెన్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. పైగా లారెన్స్ కమల్, రజినీకాంత్ లకు పెద్ద ఫ్యాన్. అలాంటిది కమల్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటారు. ఈ సినిమాలో లారెన్స్.. కమల్ తో కలిసి నటించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus