Raghava Lawrence: అభిమాని పట్ల లారెన్స్ చేసిన పని చూస్తే షాక్ అవుతారు..!

ఈమధ్య ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే.. వెంటనే అభిమానులు స్టేజ్ ఎక్కి తమ అభిమాన హీరోలను దగ్గరకు వెళ్లి కలవాలి అని ఆత్రుత పదడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా ఏ అభిమాని హీరో చేసిన.. వెంటనే ఆ హీరో బౌన్సర్లు వచ్చి వాళ్లను తీసుకెళ్లి పోతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఏకంగా హీరోలు కూడా ఆ అభిమానులను కసురుకోవడం చూసాం. ఇప్పుడు ఇలానే లారెన్స్ కి జరగగా.. ఆయన చేసిన పని మాత్రం అందరూ అభినందించేలా చేసింది.

అసలు విషయానికి వస్తే లారెన్స్, ఎస్జె సూర్య హీరోలగా చేసిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. వేదికపై లారెన్స్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమాని ఒకరు వెంటనే లారెన్స్ పైకి దూసుకుని వచ్చారు. ఇక లారెన్స్ వైపు దూసుకుని వచ్చి ఆ అభిమాని లారెన్స్ కాళ్ల పైన కూడా పడిపోయారు.

ఇక తన మీదికి దూసుకుని వస్తున్న అభిమానిని చూసి వెంటనే లారెన్స్ ‘ఏంటమ్మా’ అని అడిగారు. కాళ్లపై పడుతుంటే.. వద్దు వద్దని.. తిరిగి తన అభిమాని కాళ్లకి నమస్కారం చేసేశారు లారెన్స్. ఇది చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. బౌన్సర్లు అతనిపైకి దూసుకొస్తుండగా.. ఆగండి అని ఆపేశారు లారెన్స్. అంతేకాదు తన కాళ్ల పైన పడిన తరువాత అతనిని దగ్గరికి తీసుకొని అతను చెప్పేదంతా ప్రశాంతంగా విన్నారు.

ఆ తరువాత ఆ అబ్బాయి చెప్పిన దాన్ని అందరికీ చెపుతూ.. ‘ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే.. నేను మా అమ్మకి గుడికట్టాను కదా.. అలానే అదే విషయాన్ని ప్రేరణ గా తీసుకొని తన గుండెలపై తల్లి పచ్చబొట్టుని పొడిపించున్నాడట’ అంటూ అతని గుండెలపై ఉన్న అమ్మ పచ్చబొట్టుని చూపించారు లారెన్స్. చాలా సంతోషం.. అంటూ తన అభిమానిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు కూడా పెట్టేశారు.
ఇక ఇది చూసిన వారంతా (Raghava Lawrence) లారెన్స్ కి ఫిదా అయిపోయారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus