‘హ్యాపీడేస్’ (Happy Days) సినిమాతో స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సినిమా పేరు చెప్పగానే ముందుగా అందరికీ టైసన్ పాత్ర గుర్తుకొస్తుంది. ఆ పాత్రతో మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులంతా ట్రావెల్ చేశారు. సినిమా కంప్లీట్ అయ్యాక కూడా టైసన్ తాలూకు జ్ఞాపకాలు ప్రేక్షకులను వెంటాడాయి అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ పాత్రకి తన నటనతో జీవం పోశాడు రాహుల్ హరిదాస్ (Rahul Tyson). ఆ సినిమా తర్వాత ఇతనికి కూడా వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి.
‘రెయిన్ బో’ ‘ముగ్గురు’ (Mugguru) ‘ప్రేమ ఒక మైకం’ ‘లవ్ యు బంగారం’ ‘వెంకటాపురం’ వంటి సినిమాల్లో ఇతను హీరోగా చేశాడు. కానీ ఇందులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.అతను హీరోగా క్లిక్ అవ్వలేదు. ‘పైగా 6 ప్యాక్ కూడా చేసి యూత్ ని ఆకర్షించాలి’ అనే ఇతని ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఇక దాదాపు ఇతన్ని మర్చిపోయారు.. ‘రాహుల్ ఫేడౌట్ అయిపోయాడు’ అని ప్రేక్షకులు అనుకుంటున్న టైంలో ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) రూపంలో అతనికి ఓ సక్సెస్ వచ్చి పడింది.
‘ఆర్.ఎక్స్.100 ‘ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya) ఈ సినిమాలో హీరో అయినప్పటికీ.. కథ మొత్తం రాహుల్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. హీరోకి ఏమాత్రం తగ్గని రోల్ అది. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ‘హ్యాపీడేస్’ తర్వాత ఈ సినిమాలో మరోసారి రాహుల్ అమాయకుడి పాత్రలో నటించి మెప్పించాడు. మొత్తానికి అతని 7 ఏళ్ళ నిరీక్షణకి ఫలితం దక్కినట్టే. మరోపక్క అతను ఇంకో 3 సినిమాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ‘యూవీ’ బ్యానర్లోనే ఇంకో సినిమా చేస్తున్నాడు రాహుల్. దీంతో పాటు వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా, టైం ట్రావెల్ కథాంశంతో ఇంకో సినిమా.. చేస్తున్నాడు. కాబట్టి అతని లైనప్ బాగుందనే చెప్పాలి. అవి కూడా సక్సెస్ అయితే..రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్ కి మరింత బూస్టప్ అందినట్టు అవుతుంది అని చెప్పొచ్చు.