నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి చాలా రోజుల క్రితమే అనౌన్స్‌మెంట్ అయిపోంది. సినిమా ఏంటి, కథ ఏంటి, దర్శకుడు ఎవరు లాంటి వివరాలు చెప్పకపోయినా… సినిమా ఉంటుంది అని మాత్రం చెప్పేశారు. అంతేకాదు ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ఆ సినిమా ఉండొచ్చు అని చెప్పారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయ్యింది. అప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఈ పాటికి సినిమా మొదలవ్వాలి కూడా. కానీ ఏమైందో కానీ బాలయ్య ఇంకా తన కొడుకును ముందుకు తీసుకురావడం లేదు.
మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి శ్రీనుతో అని గతంలో వార్తలొచ్చాయి. కథ కూడా సిద్ధం చేశారని, బాలయ్యకు వినిపించారని కూడా అన్నారు. అయితే ఆ సినిమా ముచ్చట్లు ఆగిపోయాయి. ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. తన కొడుకును తానే పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో చర్చ ఇటువైపు వచ్చింది. అయితే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో అదరగొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తన దగ్గర ఉన్న కథల గురించి చెబుతూ… ఓ టైమ్ ట్రావెల్ స్టోరీ ఉందని చెప్పాడు. దీంతో అది మోక్షజ్ఞ కోసం అయితే ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
రాహుల్ సాంకృత్యాన్ సినిమాలకు రోటీన్‌కి భిన్నంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు ‘ట్యాక్సీవాలా’, ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’ దేనికదే భిన్నం. ఇప్పుడు టైమ్ ట్రావెల్ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రాహుల్‌కు అడ్వాన్స్ ఇచ్చేసి ఉంది. ఒకవేళ ఈ కథతోనే సినిమా చేయాలని అనుకుంటే… హీరో ఎవరు అనేది చూడాలి. మోక్షజ్ఞ ఆ హీరో అయితే రాహుల్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే తాజా చర్చ సారాంశం.
అయితే బాలయ్య ఎలాంటి కథను ఓకే చేస్తాడు. కొడుకును ఎలాంటి సినిమాతో రంగంలోకి దింపుతాడు అనేది ఆసక్తికరం. 2021 సంగతి ఇంక వదిలేద్దాం. 2022లో అయినా బాలయ్య తన కొడుకు సినిమా సంగతి అనౌన్స్ చేస్తాడేమో చూడాలి. ఎలాంటి కథ ఎంచుకున్నా… తన మీద ఉన్న భారీ అంచనాల్ని అందుకోవడం మోక్షజ్ఞ చాలా కష్టపడాలి అనేది మాత్రం పక్కా.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!