కొన్నిసార్లు చిన్నచిన్న డైలాగ్స్, హీరోల మేనరిజమ్స్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ రావడం జరుగుతుంది. పుష్ప ది రైజ్ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు అవతలి వ్యక్తులకు సమాధానం ఇచ్చే సమయంలో తగ్గేదేలే అంటూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డైలాగ్ ను చెబుతూ ఈ సినిమాకు క్రేజ్ ను మరింత పెంచుతున్నారు. అయితే తాజాగా రైల్వే శాఖ కూడా బన్నీ క్రేజ్ ను వాడుకుంది.
తగ్గేదేలే అనే డైలాగ్ ను దక్షిణ మధ్య రైల్వే ఇమిటేట్ చేస్తూ రైలు పట్టాలు/ట్రాక్‌లపై నడిచేదేలే అంటూ బన్నీ పోస్టర్ పై రాసుకొచ్చారు. హైదరాబాద్ పోలీసులు కొన్నిరోజుల క్రితం రోడ్డు భద్రతా నియమాల గురించి చెప్పడానికి బన్నీ ఫోటోను ఉపయోగించిన సంగతి తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే బన్నీ పోస్టర్ తో పాటు ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని రైలు పట్టాలపై నడవటం లేదా దాటడం చేయవద్దని పేర్కొంది. సబ్ వే లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను రైల్వే ట్రాక్ దాటడం కొరకు ఉపయోగిస్తే మంచిదని రైల్వే శాఖ తెలిపింది.
ఈ సినిమా 50 రోజుల్లో ఏకంగా 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే కొంతమంది ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం ఈ కలెక్షన్లలో నిజం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు పుష్ప ది రూల్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. పుష్ప ది రైజ్ ను మించి పుష్ప ది రూల్ ఉండబోతుందని సమాచారం అందుతోంది. విదేశాల్లోని లొకేషన్లలో పుష్ప ది రూల్ ను చిత్రీకరించనున్నారని బోగట్టా.
ఆసక్తికరమైన మలుపులతో పుష్ప ది రూల్ తెరకెక్కుతోందని పుష్ప ది రూల్ లో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.