అల్లు అర్జున్‌ని మాలీవుడ్‌లో మల్లు అర్జున్ అని పిలుస్తారు. బన్నీ చేసిన తెలుగు సినిమాలను అక్కడ చూసి, ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలు చేసి కేరళ వాసులు అలా పిలుచుకోవడం మొదలుపెట్టారు. బన్నీ కూడా వారి కోసం ప్రత్యేకంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలో మలయాళం లిరిక్స్‌తో నేషనల్ వైడ్‌గా ఓ పాటను పెట్టాడు. అంతగా తన మీద ప్రేమను చూపిస్తున్న కేరళైట్స్ మీద తన ప్రేమను కూడా చూపించాడు. అందుకేనేమో మలయాళ నేల మీద పుట్టిన ముద్దుగుమ్మ ఒకరు బన్నీని మలయాళ హీరో అనే అనుకుందట.
రోషన్‌తో కలసి తాను నటించిన ‘ఛాంపియన్’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన అనస్వర రాజనే ఈ కామెంట్లు చేసింది. తెలుగు సినిమాలతో తనకున్న పరిచయం గురించి మాట్లాడుతూ బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ సినిమాను తెలుగులో మొదట చూసిందట. వాళ్ల నానమ్మ ఆ సినిమా చూస్తుంటే అనస్వర కూడా చూసిందట. అయితే అది తెలుగు మూవీ అని అప్పుడు తెలియదట. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా చూసేదట.

అంతేకాదు ఆ సినిమాలు చూస్తున్న సమయంలో అల్లు అర్జున్ తెలుగు హీరో అని తెలియదట. బన్నీ మలయాళ హీరోనే అని అనుకుందట. ఇక రామ్ చరణ్ ‘మగధీర’ సినిమా చూశాకే తెలుగు సినిమాలు, నటులు గురించి తెలిసింది అని చెప్పింది. అసలు అప్పటివరకూ తాను తెలుగు సినిమాలు చూస్తున్నానని కూడా తెలియలేదు అని చెప్పింది. అనస్వర. మలయాళంలో డబ్బింగ్ అవుతున్నాయి కాబట్టి.. ఇతర భాషల సినిమాలు అనుకుంది తప్ప.. తెలుగు సినిమాలు అనుకోలేదని అర్థమవుతోంది. అయితే సోషల్ మీడియా యుగంలో ఇలా ఏమీ తెలియని అమ్మాయిలు ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ‘ఛాంపియన్’ సినిమా విషయానికొస్తే.. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి రోషన్ తన రెండో ప్రయత్నంలో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.
