Netflix: ‘గన్స్ అండ్ గులాబ్స్’.. ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్ల కొత్త ప్రాజెక్ట్!

బాలీవుడ్ లో తమ టాలెంట్ తో సత్తా చాటారు రాజ్ అండ్ డీకే. తెలుగు వాళ్లు అయిన వీరిద్దరూ హిందీలో దాదాపు అరడజనుకుపైగా సినిమాలను రూపొందించారు. కానీ అవేవీ కూడా సరైన ఫేమ్ ను తీసుకురాలేకపోయాయి. అయితే వారు తీసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అయింది. నేషనల్ వైడ్ గా ఈ సిరీస్ కు గుర్తింపు వచ్చింది. ఇండియాలో తెరకెక్కిన సిరీస్ లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

అమేజాన్ ప్రైమ్‌కు భారీగా సబ్‌స్క్రైబర్లను తెచ్చి పెట్టిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. కొత్త సీజన్ ని కూడా రూపొందించాలని భావిస్తున్నారు. అయితే అది సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈలోపు రాజ్ అండ్ డీకే మరో సిరీస్ ను లైన్ లో పెట్టారు. వరుసగా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ చేస్తున్న రాజ్ అండ్ డీకేలకు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించబోయే ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించబోతున్నారు. ఇది ఫన్నీగా సాగే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ అని సమాచారం. థ్రిల్లర్ స్టోరీ అయినప్పటికీ.. కథలో మంచి ఎంటర్టైన్మెంట్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. ఇందులో ప్రధాన తారాగణం గురించి వివరాలు బయటపెట్టనప్పటికీ.. షూటింగ్ మాత్రం మొదలైపోయిందని తెలుస్తోంది.

ఇది పూర్తయిన తరువాత ప్రైమ్ కోసం మరో వెబ్ సిరీస్ చేసి.. ఆ తరువాత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus