Brahmamudi: కావ్యకు సపోర్ట్ చేస్తూ స్వప్నకు చివాట్లు పెట్టిన రాజ్!

  • July 20, 2023 / 11:11 AM IST

కుటుంబ కథా నేపథ్యంలో ప్రసారమవుతు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇలా ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…స్వప్న స్కిప్పింగ్ చేస్తుండగా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అంటూ రాజ్ రుద్రాణిపై ఫైర్ అవుతారు. ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ ఎవరి పనులకు వారు వెళ్లిపోగా ఏ తప్పు జరిగిన అందరూ నన్నే అంటున్నారని రుద్రాన్ని ప్రెస్టేషన్ అవుతుంది.

ఇక ఆఫీస్ కి వెళ్ళినటువంటి రాజ్ డిజైన్స్ తీసుకురమ్మని చెబుతారు. శృతి డిజైన్ తీసుకొని వెళ్లగా ఫ్రీ లాన్సర్ వచ్చిన తర్వాత వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది కదా అనడంతో శృతి కూడా అవునని చెబుతుంది.డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి డిజైనర్ ను పొగడకుండా ఎలా ఉంటాము. ఒకసారి శిరీషకి ఫోన్ కలిపివ్వు అంటూ రాజ్ అడగడంతో శృతి ఇబ్బందిపడుతుంది.వెంటనే ఫోన్లో కావ్య అనే పేరును తొలగించి శిరీష అని ఫీడ్ చేసి తనకు ఫోన్ చేస్తుంది.

ఫోన్ తీసుకున్నటువంటి రాజ్ నువ్వు వెళ్లి నీ పని చేసుకొని ఫోన్ తర్వాత ఇస్తానని చెబుతాడు. హలో శిరీష గారు మీ డిజైన్స్ చాలా బాగున్నాయి అంటూ కావ్యతో మాట్లాడటమే కాకుండా కావాలనే కావ్యన్ని తిడతాడు.మీరు అద్భుతంగా డిజైన్స్ వేశారు కానీ నా భార్య ఉంది 11 చుక్కల ముగ్గులు వేస్తూ కూర్చుంటుంది అంటూ కావాలనే తనని తిడతారు.మీలా అందరికీ టాలెంట్ ఉండదులెండి అని చెప్పడంతో భార్య కూడా వెటకారంగా మా భర్త ఉన్నారు తన భార్యను అందరి ముందు తిడుతుంటారు.

కనీసం భార్య మనసు కూడా అర్థం చేసుకోలేని కర్కోటకుడు అంటూ కావ్య రివర్స్ కౌంటర్ ఇస్తుంది దాంతో ఫోన్ పెట్టేసిన రాజ్ ఇది మహాముదురు అనుకుంటారు. మరోవైపు ఎలాగైనా అప్పు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చాలని అప్పు పనిచేస్తున్న పిజ్జా సెంటర్ వద్దకు వెళ్లి పది పిజ్జాలు డెలివరీ తను చెప్పిన చోటికి ఇవ్వమని చెబుతారు. అయితే ఇది తానుచెప్పానని అప్పుకి తెలియకూడదు అని అంటారు వెంటనే అప్పుకి పది పీజాలు డెలివరీ ఇవ్వమని చెప్పి పంపిస్తారు.

అయితే కళ్యాణ్ తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతాడు. ఇక ఆ వ్యక్తి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడంతో ఎందుకు ఇచ్చావు అని అప్పుడు అడుగుతుంది వయసులో ఉన్నావు కదా ఏవైనా అవసరాలు ఉంటాయని తప్పుగా మాట్లాడటంతో అప్పు వాడినీ నాలుగు తన్ని వస్తుంది.ఇదంతా ఫోన్లో విన్న కళ్యాణ్ తన ప్లాన్ ఫ్లాప్ అయిందని అనుకుంటాడు.

మరోవైపు డైటింగ్ చేస్తూ స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ కంగారు పడి వెంటనే డాక్టర్ని రమ్మంటారు. డాక్టర్ తినకపోవడం వల్లే నీరసంగా వచ్చిందని చెప్పడంతో అందరూ తనని తిట్టగా నేను పొద్దున్న జీరా రైస్ చేసి ఇవ్వమని కావ్యను అడిగాను. తను చేసి ఇవ్వలేదని కావ్య పై నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది అంతలోపే వంటింట్లో ఉన్నటువంటి జీరా రైస్ తెచ్చి తన ముందు పెడుతుంది ధాన్యలక్ష్మి.

ఇప్పుడు పిన్ని తెచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అందరూ కావ్యను అపార్థం చేసుకునేవారు కదా అంటూ స్వప్నని తిడుతూ రాజ్ తన భార్యకు సపోర్ట్ చేస్తారు. తరువాయి భాగంలో (Brahmamudi) సోఫా వెనుక కూర్చొని స్వప్న డిజైన్స్ వేస్తూ ఉండగా రాజ్ తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus