Anubhavinchu Raja Trailer: రాజ్ తరుణ్ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా!

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ కు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సక్సెస్ లేకపోయినా రాజ్ తరుణ్ కు ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటించిన అనుభవించు రాజా ట్రైలర్ తాజాగా అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్ గా, పెద్దలు సంపాదించిన డబ్బును దుబారాగా కోళ్ల పందేలా కోసం ఖర్చు పెట్టే యువకునిగా కనిపించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అజయ్ విలన్ రోల్ లో నటిస్తుండగా కథ, కథనం రొటీన్ గానే ఉన్నా ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

నవంబర్ 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా రాజ్ తరుణ్ హిట్టు కొడతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ కశిష్ ఖాన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా సెక్యూరిటీ గార్డ్ లను ద్వేషించే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. సుప్రియ యార్లగడ్డ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్టు సమాచారం. రాజ్ తరుణ్ శ్రీనివాస్ గవిరెడ్డి కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానని శ్రీనివాస్ గవిరెడ్డి భావిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus