Raj Tarun , Lavanya Case: లావణ్య ఇష్యూలో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్.. తెగేదాకా లాక్కుతున్నాడా?
- September 8, 2024 / 07:56 PM ISTByFilmy Focus
యువ కథానాయకుడు పేరు ఇప్పుడు మీడియాలో రోజుకో వార్త వస్తోంది. ఇటు సినిమాలు, అటు వ్యక్తిగత విషయాలు కలిపి ఆయన వైరల్ టాపిక్ అయిపోయాడు. సినిమాల సంగతి పక్కనపెడితే లావణ్య వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ విషయంలో రూ. 70 లక్షల విషయం ఒకటి బయటకు వచ్చింది. రాజ్ తరుణ్ (Raj Tarun) – లావణ్య మధ్య గొడవ కాస్త సద్దుమణిగినట్లు ఇటీవల అనిపించింది. కానీ ఈ కేసులో తాజాగా పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.
Raj Tarun , Lavanya Case

రాజ్ (Raj Tarun) పేరును ఆ ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా పేర్కొన్నారు. మొత్తంగా పరిశీలిస్తే రాజ్ తరుణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నట్లు అర్థమవుతోంది. దీంతో మరోసారి రాజ్ తరుణ్ – లావణ్య విషయం చర్చకు వచ్చింది. ఛార్జ్ షీట్‌లోని అంశాలు బయటకు వచ్చిన నేపథ్యంలో లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరోసారి రాజ్ తరుణ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేసింది. ఈ సందర్భంగా ఆమె ఇప్పటివరకు బయటకు రాని, చెప్పిన ఓ ఆశ్చర్యకర విషయం గురించి చెప్పింది.

అందరూ అనుకుంటున్నట్లుగా రాజ్ తరుణ్ (Raj Tarun) తనను పోషించలేదని.. తనే అతణ్ని పోషించానని చెప్పింది. తన తల్లిదండ్రులే రాజ్‌కు రూ.70 లక్షల వరకు డబ్బులు ఇచ్చారని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ ఆ మధ్య సినిమాలు లేకుండా రెండేళ్లు ఖాళీగా ఉండిపోయాడని, ఆ సమయంలో తన తల్లిదండ్రులు స్థలాలు అమ్మి మరీ రూ.70 లక్షలు రాజ్‌కు ఇచ్చారని లావణ్య చెప్పింది.

తమ స్థలాలు అమ్మిన తేదీలు, రాజ్‌కు డబ్బులు ఇచ్చిన చెక్కుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. మరోవైపు రాజ్ తరుణ్ (Raj Tarun) , లావణ్య కలిసి ఉన్న ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించామని.. ఈ కేసులో రాజ్ నిందితుడే అని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రాజ్ తరుణ్ ఈ కేసులో సేఫ్ ఏమీ కాదని అర్థమవుతోంది. ఈ క్రమంలో అతణ్ని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అని తెలుస్తోంది.











