Raj Tarun: రాజ్ తరుణ్ ఏంటి ఇలా అయిపోయాడు..!
- October 10, 2024 / 10:52 PM ISTByFilmy Focus
సినిమా సినిమాకి హీరోలు కథల ఎంపికతో పాటు.. లుక్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఒకప్పటిలా ఇప్పుడు అభిమానులు కూడా లుక్స్ మార్చకపోతే తమ హీరోలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సందర్భాలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది హీరోలు లుక్స్ మార్చలేని పరిస్థితి కూడా ఉంటుంది. బహుశా వాళ్ళకి ఉన్న ఇమేజ్ వల్ల కూడా కావచ్చు. అది పక్కన పెట్టేస్తే..యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) కూడా అదే లిస్టులోకి వస్తాడేమో..!
Raj Tarun

రాజ్ తరుణ్.. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎక్కువగా లవ్ స్టోరీలే చేశాడు. మధ్య మధ్యలో మాస్ సినిమాలు చేసినా.. లుక్స్ వైజ్ కొత్తగా కనిపించింది అంటూ ఏమీ లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ సాఫ్ట్ గానే ఉంటాడు కాబట్టి.. అతనికి తగ్గ సబ్జెక్టులే ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల లుక్స్ పరంగా రాజ్ తరుణ్ ఇప్పటివరకు కొత్తగా ట్రై చేసింది లేదు.
అయితే ఇప్పుడు సుధీర్ రాజు అనే దర్శకుడితో ‘రామ్ భజరంగ్’ అనే సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఇది పక్కా మాస్ సినిమా. రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ తో సాగుతుంది ఈ సినిమా అని అంతా అంటున్నారు. తాజాగా ఈ చిత్రంలో రాజ్ తరుణ్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.
ఇందులో రాజ్ తరుణ్ నోట్లో బీడీ పెట్టుకుని, ఉంగరాల జుట్టుతో చాలా మాస్ గా కనిపిస్తున్నాడు. ఒక రకంగా అతను ‘పుష్ప’ లో (Pushpa 2) అల్లు అర్జున్ (Allu Arjun)..లా కనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు. విగ్ కూడా బాగా సెట్ అయ్యింది. మరి ఈ లుక్ కి తగ్గట్టు.. పెర్ఫార్మన్స్ ఎలా ఇస్తాడో చూడాలి
Raj tarun new look #RajTarun pic.twitter.com/9xT5eudfqu
— Phani Kumar (@phanikumar2809) October 10, 2024
















