ఏప్రిల్ 29న `రాజా చెయ్యి వేస్తే`

బాణం సినిమా నుండి నేటి వ‌ర‌కు ప్ర‌తి సినిమాను డిఫ‌రెంట్‌గా చేస్తూ త‌న ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. ఈగ’, ‘అందాల రాక్షసి’,’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. అల్రెడి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ఇటీవ‌ల యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆడియో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌లైన సంగతి తెలిసిందే. సాయికార్తీక్ అందించిన ఈసినిమా పాట‌ల‌కు మంచి ఆడియెన్స్ నుండి మంచి స్సంద‌న వ‌చ్చింది. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్పాన్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమా

ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏఫ్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామ‌ని వారాహి చల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి తెలియ‌జేశారు. నారా రోహిత్ ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్‌ఫార్మెన్స్‌, నంద‌మూరి తార‌క‌ర‌త్న టెరిఫిక్ విల‌నిజం ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయ‌ని చిత్ర‌యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus