శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. ఆగష్ట్ 19న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత శ్రీవిష్ణుకి మంచి విజయం దక్కిందని అందరూ ప్రశంసిస్తున్నారు.’అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.
మొదటి రోజు కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం
0.16 cr
సీడెడ్
0.09 cr
ఉత్తరాంధ్ర
0.09 cr
ఈస్ట్
0.08 cr
వెస్ట్
0.08 cr
గుంటూరు
0.11 cr
కృష్ణా
0.07 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.05 cr
ఓవర్సీస్
0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.82 cr
‘రాజ రాజ చోర’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.5.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.82 కోట్ల షేర్ ను రాబట్టింది. మార్నింగ్ షోలు కాస్త డల్ గా కనిపించినా.. ఈవెనింగ్ షోలకు పికప్ అయ్యింది. రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీకెండ్ మొత్తం ఇదే జోరు చూపిస్తే సినిమా చాలా వరకు రికవర్ చేసే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ మరో రూ.4.43 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.