Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘ఆర్ఎక్స్ 100’ను మించి ‘రాజావిక్రమార్క’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – నిర్మాత ’88’ రామారెడ్డి ఇంటర్వ్యూ

‘ఆర్ఎక్స్ 100’ను మించి ‘రాజావిక్రమార్క’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – నిర్మాత ’88’ రామారెడ్డి ఇంటర్వ్యూ

  • August 20, 2021 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్ఎక్స్ 100’ను మించి ‘రాజావిక్రమార్క’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – నిర్మాత ’88’ రామారెడ్డి ఇంటర్వ్యూ

సినిమాలపై ప్యాషన్‌తో గ్రామీణ నేపథ్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన నిర్మాతలు కొందరు ఉన్నారు. ఘనవిజయాలు అందుకున్నారు. ఈ బాటలో వస్తున్న నిర్మాత ’88’ రామారెడ్డి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఆయన ‘రాజా విక్రమార్క’ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. ఈ శుక్రవారం (ఆగస్టు 20న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ’88’ రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ…

హ్యాపీ బర్త్‌డే రామారెడ్డిగారు!

థాంక్యూ అండీ. థాంక్యూ! తొలిసారి మీడియా మిత్రుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.

మీది ఏ ఊరు, నేపథ్యం ఏమిటి?

మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి.

వ్యాపారం నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు రెండొందల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని సినిమాలు సొంతంగా విడుదల చేశారు. వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా.

‘రాజా విక్రమార్క’ ఎలా మొదలైంది?

సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు… వినోద్ రెడ్డి దగ్గరకు ‘రాజా విక్రమార్క’ కథ వచ్చింది. ఆయనతో పరిచయం ఉండటంతో మాటల మధ్యలో ఈ కథ గురించి చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశాం. అలా వినోద్ రెడ్డి దగ్గర నుండి మా దగ్గరకు సినిమా వచ్చింది.

సినిమా ఎలా ఉండబోతోంది?

ఇది యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. ’90 ఎంఎల్’ చేస్తున్నప్పుడు హీరోగారితో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత చేయాలని అనుకున్నాం. ‘చావు కబురు చల్లగా’ తర్వాత వస్తే… బావుంటుందని, ఆ సినిమా తర్వాత మా షూటింగ్ స్టార్ట్ చేశాం. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు శ్రీ సరిపల్లి కాంప్రమైజ్ కాకుండా తీశాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువపెట్టి మరీ తీశాం. ‘ఆర్ఎక్స్ 100’కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఆ విషయంలో నో డౌట్.

కార్తికేయతో మీ అసోసియేషన్ గురించి…

చాలా చాలా మంచోడు. ‘ఇలాంటోళ్లు ఉంటారా?’ అనుకున్నాను. నా అంచనాలను మించిపోయారు. అతని గురించి మరో మాట అవసరం లేదు. అంత మంచోడు. నంబర్ వన్ మనిషి.

‘రాజా విక్రమార్క’ చిత్రీకరణ పూర్తయింది. ప్రొడక్షన్ లో మీరు నేర్చుకున్నది ఏమిటి?

ప్రతిరోజూ సెట్స్ కు వెళ్లాను. దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకున్నాను. ఒక్క సినిమాతో పది సినిమాలు తీసిన అనుభవం వచ్చింది. కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. ఆ బాధ ఉంది. అయితే, సినిమా బాగా వచ్చిందని మా టీమ్ అంతా సంతోషం ఉన్నాం. మామూలుగా అయితే కరోనా వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవుడి దయ వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా హ్యాపీగా పూర్తయింది.

సినిమాను విడుదల ఎప్పుడు?

కరోనా పరిస్థితులు నియంత్రణలోకి వస్తే… అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాం.

హీరోల్లో ఎవరంటే మీకు ఇష్టం?

మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం. మా సినిమాకు చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకున్నాం. కథ ప్రకారం కుదిరింది కూడా! మా సినిమా ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాం. సినిమాలో చిరంజీవిగారి అభిమానులు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అభిమానులు అందరూ ఈలలు వేస్తూ గోల గోల చేసేలా ఉంటుంది.

అభిమానిగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూసి ఉంటారు. మీకు మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్?

చూసినవి ఉన్నాయి. చూద్దామని వెళ్లి టికెట్ దొరక్క థియేటర్ ముందు పడిగాపులు కాసిన అనుభవం ఉంది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ‘ఇంద్ర’ సినిమా చూడాలని మా ఊరు కొంకుదురు నుండి సైకిల్ వేసుకుని మండపేట వెళ్లాను. (నవ్వుతూ) సైకిల్ పార్క్ చేసి టికెట్ తీసుకుందామని వెళ్లాను. నా దగ్గరకు వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేసేశారు. అభిమానుల మధ్య తోపులాటలో నా చెప్పు పోయింది. ఎలాగైనా సినిమా చూడాలని థియేటర్ దగ్గర వెయిట్ చేసి నెక్స్ట్ షో చూసి ఊరెళ్లా. ఆ రోజుల్లో అభిమానులు పడిన తిప్పలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేవండి! థియేటర్లల దగ్గర కోలాహలం, అభిమానుల సందడి… ఆ రోజులు మళ్లీ రావాలి.

నిర్మాతల్లో ఎవరంటే ఇష్టం?

మూవీ మొఘల్ డి. రామానాయుడుగారు నాకు ఆదర్శం. ఆయనలా సినిమాలు నిర్మించాలి.

మీ పేరు ముందు ’88’ అని ఉంటుంది. కారణం ఏమిటి?

డబుల్ ఎయిట్ అని పెట్టుకోవడం వెనుక గల కారణాన్ని ఓ నాలుగు సినిమాల తర్వాత చెబుతా. కొత్త కథలతో మంచి సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఉంటాను. నెక్స్ట్ నిర్మించబోయే సినిమా పనులు మొదలుపెట్టాం.

‘రాజా విక్రమార్క’ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నారు? ఎటువంటి సినిమా చేస్తున్నారు?

‘రాజా విక్రమార్క’ తర్వాత పది కథలు విన్నాను. అందులో రెండు నచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. హీరోలకు కథలు వినిపించాం. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది ముందు ప్రారంభం అవుతుందనేది అన్నీ కుదిరిన తర్వాత వెల్లడిస్తా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #producer
  • #Producer Rama Reddy
  • #Raja Vikramarka

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version