Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ కోస్టార్ – ‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఇంటర్వ్యూ

‘కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ కోస్టార్ – ‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఇంటర్వ్యూ

  • November 5, 2021 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ కోస్టార్ – ‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఇంటర్వ్యూ

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతిభావంతులైన కొత్త కథానాయికలకు ఎప్పుడూ ఆహ్వానం అందిస్తుంది. ఆహ్వానం అందుకుని తెలుగు తెరకు వస్తున్న నూతన కథానాయిక తాన్యా రవిచంద్రన్. ‘రాజా విక్రమార్క’ సినిమాలో కార్తికేయకు జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం చేస్తూ… శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు.

ప్రశ్న: మీది సినీ నేపథ్యమున్న కుటుంబమే. మీ తాతయ్యగారు రవిచంద్రన్ సీనియర్ హీరో. మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు?

తాన్యా రవిచంద్రన్: చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. ‘ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు’ అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పను. అయితే… వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక… పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్ఆర్‌) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.

ప్రశ్న: ‘రాజా విక్రమార్క’లో అవకాశం ఎలా వచ్చింది?

తాన్యా రవిచంద్రన్: దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా.

ప్రశ్న: సినిమాలో లేదా మీ పాత్రలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?

తాన్యా రవిచంద్రన్: నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ… కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి.

ప్రశ్న: కథ గురించి ఇంకేం చెబుతారు?

తాన్యా రవిచంద్రన్: ఆల్రెడీ ట్రైలర్లు చూసి ఉంటారు కదా! కార్తికేయ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. అంతకు మించి చెప్పలేను. నవంబర్ 12న విడుదల అవుతుంది. థియేటర్లలో సినిమా చూడండి. చాలా బావుంటుంది. మా నిర్మాత ’88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు.

ప్రశ్న: కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్…

తాన్యా రవిచంద్రన్: హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.

ప్రశ్న: కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ. ‘రాజా విక్రమార్క’లో మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది?

తాన్యా రవిచంద్రన్: నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ప్రామినెంట్ రోల్. వచ్చి వెళుతూ ఉంటుంది.

ప్రశ్న: తెలుగు మాట్లాడుతున్నారా?

తాన్యా రవిచంద్రన్: ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ, వెంటనే తిరిగి మాట్లాడలేను.

ప్రశ్న: సినిమా షూటింగ్ చేసేటప్పుడు తెలుగు మాట్లాడటం ఇబ్బంది అయ్యిందా?

తాన్యా రవిచంద్రన్: ముందు కొంత భయపడ్డాను. షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నేను హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు శ్రీ నాకు ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే, డైలాగులకు అర్థం వివరించడంతో పాటు తెలుగు డైలాగులకు ఇచ్చాడు. నా పాత్ర డైలాగులు మాత్రమే కాదు… సన్నివేశంలో మిగతా ఆర్టిస్టుల డైలాగులు కూడా ఇచ్చారు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది.

ప్రశ్న: సినిమాలో పాటల గురించి…

తాన్యా రవిచంద్రన్: ప్రశాంత్ ఆర్. విహారి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ తొలి సాంగ్ విని ఉంటారు కదా! నేపథ్య సంగీతం కూడా బాగా చేశారని విన్నాను.

ప్రశ్న: సినిమా చూశారా? మీకు చెప్పినట్టు తీశారా?

తాన్యా రవిచంద్రన్: నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, షూటింగ్ చేశా కదా! నాకు దర్శకుడు శ్రీ ఏదైతే కథ, సన్నివేశాలు చెప్పాడో… అదే తీశాడు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.

ప్రశ్న: సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ రవిచంద్రన్ ఏమన్నారు?

తాన్యా రవిచంద్రన్: దురదృష్టవశాత్తూ… నేను సినిమాల్లోకి వస్తానని ఆయనకు తెలియకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాతయ్య చాలా హార్డ్ వర్కింగ్. ఆయనలో అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. వ్యక్తిగతంగా నేను ఆ మూడు లక్షణాలు నేర్చుకున్నాను. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు  తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tanya Ravichandran
  • #Raja Vikramarka Movie
  • #Tanya Ravichandran

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

3 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

4 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

9 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

7 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

8 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

9 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

10 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version