కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’.తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్లు సో సో గా మాత్రమే నమోదయ్యాయి.వీకెండ్ వరకు ఓ మాదిరిగా రాబట్టిన ఈ చిత్రం వీక్ డేస్ లో నిలదొక్కుకోలేకపోయింది.
‘రాజా విక్రమార్క’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.51 cr |
సీడెడ్ | 0.28 cr |
ఉత్తరాంధ్ర | 0.34 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.18 cr |
కృష్ణా | 0.21 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.22 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.24 cr |
‘రాజా విక్రమార్క’ చిత్రానికి రూ.4.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.24 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాల చోట్ల షోలు కూడా పడడం లేదు.చూస్తుంటే ఇక అసాధ్యమనిపిస్తుంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!