మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యింది. కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రూపొందిన ‘రాజకుమారుడు’ (Rajakumarudu) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. 1999 వ సంవత్సరం జూలై 30న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణగారి (Krishna) తనయుడు హీరోగా లాంచ్ అవుతున్న సినిమా కావడంతో ‘రాజకుమారుడు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘రాజకుమారుడు’ సినిమా మొదటి షోతో హిట్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఒకసారి ఫైనల్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.80 cr |
సీడెడ్ | 0.97 cr |
ఉత్తరాంధ్ర | 1.01 cr |
ఈస్ట్ | 0.98 cr |
వెస్ట్ | 0.93 cr |
గుంటూరు | 1.09 cr |
కృష్ణా | 1.04 cr |
నెల్లూరు | 0.77 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.59 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.46 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.05 cr |
‘రాజకుమారుడు’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.9.05 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో సో సోగా కలెక్ట్ చేసినా… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఫైనల్ గా రూ.4.05 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. 38 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడి డెబ్యూ హీరోల సినిమాల్లో రికార్డు సృష్టించింది.