Rajamouli: ఆర్ఆర్ఆర్ కు ఆ సీన్ హైలెట్ కానుందా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కే ప్రతి సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోలేదు. రాజమౌళి తన సినిమాలలో కనీసం ఐదారు సీన్లు ఆసక్తికర ట్విస్టులతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా తెరకెకిస్తారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch

అయితే ట్రైలర్ లో రివీల్ కానీ ఎన్నో విశేషాలు సినిమాలో ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సెకండాఫ్ లో వచ్చే ఒక సీన్ గురించి రాజమౌళి కనీసం హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోవడం గ్యారంటీ అని చరణ్, తారక్ కలిసి ఒకే స్క్రీన్ లో కనిపించే ఆ సీన్ ను చూసిన సమయంలో ప్రేక్షకులకు కలిగే ఫీలింగ్ కొత్తగా ఉంటుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి ఆ సీన్ ను థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆస్వాదించాలని చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల శరీరంలోని కండరాలు బిగుసుకునేలా ఆ సీన్ ఉంటుందని బోగట్టా. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా ఆ సీన్ ఉండనుందని ఆ సీన్ చూసే సమయంలో హార్ట్ బీట్ వేగం పెరుగుతుందని స్వయంగా రాజమౌళి చెప్పారు. రాజమౌళి తన కామెంట్లతో ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలను పెంచారు.

ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజయ్యే అవకాశాలు కూడా లేవు. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారితే మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజైన వారం రోజుల తర్వాత భీమ్లా నాయక్ రిలీజయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ 2,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus