సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. టాలీవుడ్‌లో దర్శకులలో ఈ నైపుణ్యాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించేవారిలో రాజమౌళి (S. S. Rajamouli) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముందు వరుసలో ఉంటారు. సినిమా తీయడమే కాదు, ప్రొమోషన్స్‌ను హడావిడిగా చేయడం కాకుండా, ప్రత్యేకతను జోడించడం వారి స్పెషాల్టీ. రాజమౌళి ప్రపంచ స్థాయిలో తన సినిమాలను ఎలా ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’(Baahubali), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలకు ప్రచారాలను సమర్థంగా నిర్వహించి, పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రీచ్‌ని సాధించారు.
రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ అంత తేలికైనవి కాదు. ఆయుధాలు, కాస్ట్యూమ్స్‌లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం ద్వారా పబ్లిసిటీని వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. అంతేకాకుండా యానిమేటెడ్ గేమ్స్ రూపొందించి, యువతను ఆకర్షించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాచుర్యం పొందడంలో రాజమౌళి నిపుణుడు. ఇక అనిల్ రావిపూడి గురించి కూడా చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పబ్లిసిటీ ఎలా సాధించాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమాతో తన మార్కెట్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
సినిమా ప్రదర్శన ముందు వరకు, నటీనటులందరినీ పబ్లిసిటీ కోసం సమర్థంగా ఉపయోగించుకున్నారు. ప్రత్యేక స్కిట్‌లు, షార్ట్ వీడియోలు రూపొందించడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని సినిమాపై నిలిపారు. ఇదే పద్దతిని బాలీవుడ్‌లో కూడా రాజ్‌కుమార్ హిరాణీ ( Rajkumar Hirani), రోహిత్ శెట్టి (Rohit Shetty), ఆయాన్ ముఖర్జీలు వాడతారు. వీరు సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు. వేదికలు ఎక్కడా వదలకుండా తమ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ సాధిస్తారు.
ఇక టాలీవుడ్ లో రాజమౌళి, అనిల్ రావిపూడి ఇద్దరు ఇద్దరే అని చెప్పవచ్చు. తమ సినిమాలకు అద్భుతమైన ప్రమోషన్ చేయడంలో తీసుకురావడంలో ఏకైక మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. సినిమా తీయడం గొప్పకాదు దాన్ని మార్కెట్ లోకి ఎలా తీసుకు వెళ్ళలో కూడా వీరికి బాగా తెలుసని నిరూపిస్తున్నారు.