Rajamouli Anil Ravipudi:ఆ విషయంలో రాజమౌళి అనిల్ రావిపూడిలకు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు లాభాలను అందించాయి. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తీస్తే నిర్మాతలకు భారీ లాభాలు ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అభిప్రాయం ఉంది. అయితే తమతో సినిమాలను తీసిన నిర్మాతలందరికీ లాభాలు వచ్చేలా చేసిన టాలీవుడ్ డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ విషయంలో రాజమౌళి, అనిల్ రావిపూడి సేమ్ టు సేమ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పెద్ద సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల బడ్జెట్ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్ అయినా డీల్ చేయగలరు. టాలెంట్ ను నమ్మి ఛాన్స్ ఇస్తే అనిల్ రావిపూడి ప్రూవ్ చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సక్సెస్ రేట్ విషయంలో రాజమౌళి అనిల్ రావిపూడిలకు ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి భవిష్యత్తులో సైతం ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

అనిల్ రావిపూడి తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడతాడని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.రాజమౌళి త్వరలో మహేష్ బాబు సినిమాతో బిజీ కానున్నారు. రాజమౌళి, అనిల్ రావిపూడి పారితోషికాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ కావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రాజమౌళి, అనిల్ రావిపూడి వేగంగా సినిమాలు తీసి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళికి క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus