RRR Release Date: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై అనుమానాలు అక్కర్లేదు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందేమో అనే సందేహాలు మొదలయ్యాయి.

చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధించడం, కరోనా కేసులు పెరిగిపోవడం, థియేటర్ పై ఆంక్షలు.. ఇన్ని సమస్యల మధ్య రాజమౌళి తన సినిమాను రిలీజ్ చేస్తారా..? అనే అనుమానాలు చాలా మందిలో కలిగాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు.

జనవరి 7నే సినిమా విడుదలవుతుందని రాజమౌళి తనతో చెప్పారని.. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చారు. సో.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదన్నమాట. వెండితెరపై ఈ విజువల్ వండర్ ని చూడడానికి రెడీ అయిపోవచ్చు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు.

అందుకే ముంబై, చెన్నై, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ నార్త్ సైడ్ ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు వచ్చేశాయి కాబట్టి సినిమా కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఏపీలో కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus