Rajamouli: రాజమౌళికి బాల్యంలో ఆ హీరో అంటే కోపమట.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉండటంతో పాటు తన డైరెక్షన్ స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా సినిమాకు దర్శకుడిగా ఎదుగుతున్న రాజమౌళి తన సినిమాలతో భారీ విజయాలను అందుకుంటూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలోని అందరు హీరోలు జక్కన్నను ఎంతో అభిమానిస్తారు. అయితే రాజమౌళి మాత్రం తాజాగా ఒక సందర్భంలో మురళీ మోహన్ అంటే తనకు కోపమని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నా వయస్సు 50 సంవత్సరాలు అని మురళీ మోహన్ ఇండస్ట్రీలోని వచ్చి కూడా 50 సంవత్సరాలు అని జక్కన్న కామెంట్లు చేశారు. చిన్నప్పుడు నేను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఎన్టీఆర్ మాస్ సినిమాలకు వెళ్లడానికి నేను ఇష్టపడేవాడినని రాజమౌళి కామెంట్లు చేశారు. అమ్మ, పెద్దమ్మ మాత్రం మురళీ మోహన్ అభిమానులని వాళ్లు నన్ను మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్లేవారని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ సినిమా ఒకసారి చూస్తే మురళీ మోహన్ సినిమా మూడుసార్లు చూసేవాడినని అందువల్ల చిన్నప్పుడు మురళీ మోహన్ పై కోపమని ఆయన నాకు శత్రువని రాజమౌళి సరదాగా కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మురళీ మోహన్ గొప్పతనం తెలిసిందని జక్కన్న చెప్పుకొచ్చారు. మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించారని ఆయన కామెంట్లు చేశారు. మురళీ మోహన్ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారని రాజమౌళి తెలిపారు.

తాజాగా శిల్పకళా వేదికలో మురళీ మోహన్ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో జరిపిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో రాజమౌళి ఈ కామెంట్లు చేశారు. రాజమౌళి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జక్కన్న (Rajamouli) ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమా షూట్ మొదలుకానుంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus