‘ప్రభాస్ 22’ పై దర్శక ధీరుడు రాజమౌళి కామెంట్స్…!

ఈ మధ్యనే ప్రభాస్ తన 22 వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆది పురుష్’ అనే చిత్రం చెయ్యడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రభాస్ తో రూపొందించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు.

అలాగే ఈ పాత్రకు ప్రభాస్ మాత్రమే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని దర్శకుడు ఓం రౌత్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక ‘ఆది పురుష్’ గురించి ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ…” ‘ఆది పురుష్’ ఫస్ట్ లుక్ ను నేను చాలా రోజుల క్రితమే చూసాను.రాముడిగా ప్రభాస్ బాగా సెట్ అవుతాడు అనిపించింది.ఈ మధ్యనే అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి.. భూమి పూజ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ‘ఆది పురుష్’ సినిమా ఇలాంటి టైములోనే విడుదల అయితే మంచిది.

దేశం మొత్తం ఇప్పుడు రాముడి గురించి చర్చించుకుంటుంది. రాముడి గురించి సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. ‘బాహుబలి’ వంటి ప్రభాస్… రాముడి పాత్రలో కనిపిస్తే ఆ చిత్రం మరో స్థాయిలో ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus