తన తండ్రిపై రాజమౌళి కామెంట్స్!

‘బాహుబలి’ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో దర్శకుడు రాజమౌళి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో బాహుబలి సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించాడు. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ సినిమా కథ రాయడానికి నేనే స్ఫూర్తి అని రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మా నాన్నకు ఈ కథ రాసే ఆలోచన ఎలా పుట్టిందో నాకు తెలియదు గానీ.. కథ రాయడానికి మాత్రం స్ఫూర్తి నేనే అనుకుంటాను. ఎందుకంటే నేనో గొప్ప డైరెక్టర్ అని నాన్న భావిస్తుంటారు. నాకు పరీక్ష పెట్టడానికే ఈ కథ రాసారని’ నేను అనుకుంటున్నానని రాజమౌళి అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus