Rajamouli: షూటింగ్‌లో హీరోలతో రాజమౌళి చేయించిన ఫీట్లివే..!

‘‘నేను మానిటర్‌ చూసుకొని షాట్‌ రెడీ చేసుకుంటాను. పక్కన హీరో ఎండలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడా? అనేది పట్టించుకోను’’ అంటూ ఆ మధ్య రాజమౌళి ‘అన్‌స్టాపబుల్‌’ షోలో చెప్పారు గుర్తుందా? అలాంటి సన్నివేశం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్స్‌లోనే ఇది జరిగిందట. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆరే చెప్పుకొచ్చారు. అది కూడా సినిమా షూటింగ్‌ మొదలైన రెండో రోజే రాజమౌళి ఇలాంటి సీన్‌ పెట్టారట. అయితే ఇది ముందు చెప్పిన దాని కంటే కాస్త ఎక్కువ.

సినిమా మొదలైన రెండో రోజే రాజమౌళి ఓ షాట్‌ రెడీ చేశారట. తారక్‌ 60 అడుగుల ఎత్తులో తాడుతో వేలాడే సన్నివేశం అది. ఉదయాన్నే షాట్‌కి అంతా రెడీ చేసుకొని పైన తాడులో 60 అడుగుల ఎత్తులో వేలాదీసేశారట. మామూలుగా అయితే సినిమా షూటింగ్‌ మొదలైన తొలి రోజుల్లో చిన్న చిన్న సన్నివేశాలు లాంటివి చేస్తారు. కానీ రాజమౌళి అలా అనుకోలేదు. భారీ యాక్షన్‌ సీన్‌ రెడీ చేశారు. అందుకే ఇలా 60 అడుగుల ఎత్తులో కట్టేశారు. ఈ సీన్‌ షూటింగ్‌ అవుతుండగా పది నిమిషాల తర్వాత రామ్‌చరణ్‌ అక్కడకు వచ్చాడట.

పైన తారక్‌ వేలాడుతుండటం చూసి… చరణ్‌ ఆశ్చర్యపోయాడట. రాజమౌళి ఇలాంటి పనులు సినిమా షూటింగ్‌లో చాలానే చేశాడు అని చెప్పారు ఇద్దరు హీరోలు. మరి తొలి రోజు చిన్నపాటి సీన్స్‌ తీశారా అంటే… రెండో రోజు చేయాల్సి 60 అడుగుల ఫీట్‌కు ప్రాక్టీస్‌ చేయించారట రాజమౌళి. 60 అడుగుల ఎత్తు సీన్‌ అయిపోయాక… ఒంటికి బరువులు కట్టేసి 20 అడుగుల లోతులో నీటిలోకి వెళ్లమన్నారట. ఇలాంటి ఫీట్లు రామ్‌చరణ్‌కు బాగానే అలవాటు కానీ, తనకు లేవని అందుకే ఇబ్బంది పడ్డానని తారక్‌ చెప్పుకొచ్చాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం కోసం రాజమౌళి టీమ్‌ ప్రస్తుతం ముంబయిలో బిజీగా ఉంది. అవకాశం ఉన్న అన్ని షోలు, ప్లాట్‌ఫామ్స్‌ను తెగ వాడేస్తోంది. ఈ క్రమంలో ఫుడ్‌ బ్లాగ్‌ వీడియోల్లో కూడా కనిపిస్తోంది. జొమాటో యూట్యూబ్‌ ఛానల్‌లో రామ్‌చరణ్‌, తారక్‌ల ఫుడ్‌ వీడియో ఒకటి చేశారు. దానికి సంబంధించి ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకా ఎన్ని రకాల ప్రచారాలు చేస్తారో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus