రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో ఆయన చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఈ భారీ ప్రాజెక్టును రిలీజ్ చేయడానికి ముందే జక్కన్న ఒక ఇంట్రెస్టింగ్ స్కెచ్ వేశారు. అదే ‘ఈగ’ రీ రిలీజ్. సరిగ్గా పద్నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు మళ్ళీ దులిపి థియేటర్లోకి ఎందుకు తెస్తున్నారు అనే దానికి బలమైన కారణమే ఉంది.
నిజానికి రాజమౌళి గ్రాఫ్ ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చూస్తారు. కానీ ఆయన టెక్నికల్ స్టాండర్డ్స్ కు అసలైన పునాది పడింది మాత్రం ‘ఈగ’తోనే. స్టార్ హీరో లేకుండా, కేవలం గ్రాఫిక్స్ నమ్ముకుని ఒక చిన్న ఈగతో సినిమాను బ్లాక్ బస్టర్ చేయడం అప్పట్లో ఒక సంచలనం. శంకర్ లాంటి దిగ్గజాలు గ్రాఫిక్స్ వాడినా, ఎమోషన్ ని టెక్నాలజీని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసింది మాత్రం రాజమౌళినే.
ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న ‘వారణాసి’ సినిమా 2027లో రాబోతోంది. అంతకంటే ముందు 2026లో ‘ఈగ’ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం కలెక్షన్ల కోసం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు రాజమౌళి కేపబిలిటీని గుర్తు చేయడానికి వేస్తున్న ఎత్తుగడ. హాలీవుడ్ జనాలకు ఈగ కాన్సెప్ట్ అప్పట్లోనే పిచ్చెక్కించింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ చూపిస్తే, రాజమౌళి బ్రాండ్ వాల్యూ గ్లోబల్ గా ఇంకా పెరుగుతుంది.
వారణాసి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ పీక్స్ లో ఉండబోతున్నాయి. దానికి ముందు ఇలాంటి టెక్నికల్ వండర్ ను ఆడియన్స్ కు చూపించడం వల్ల, రాబోయే సినిమాపై నమ్మకం రెట్టింపు అవుతుంది. నాని, సమంత, సుదీప్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ఇండియన్ సినిమా రేంజ్ ని మార్చింది. ఇప్పుడు అదే సినిమా మహేష్ బాబు ప్రాజెక్ట్ కు ఒక పర్ఫెక్ట్ ఇంట్రో లేదా కర్టెన్ రైజర్ లాగా పనికొస్తుందని టీమ్ భావిస్తోంది. మొత్తానికి జక్కన్న వేసే ప్రతి అడుగు వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
