దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తున్నప్పుడు ఒళ్లు జలదరిస్తుంది. . అటువంటి డైరక్టర్ కి ఒళ్లు గగుర్పొడిచిందని చెప్పారు. ఎందుకలా ఫీలయ్యారు?.. అనే విషయంలోకి వెళితే.. రాజమౌళి తెరకెక్కించిన కళాఖంఢం బాహుబలి ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. రీసెంట్ గా పాకిస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ బాహుబలిని ప్రదర్శించారు. ఈ వేడుకలో పాల్గొనాలని రాజమౌళిని నిర్వాహకులు పిలిచారు. వారి ఆహ్వానాన్ని మన్నించి అక్కడకు రాజమౌళి వెళ్లారు. ఆ కార్యక్రమంలో పాల్గొని, వారి ఆతిధ్యం స్వీకరించి, అక్కడి వారితో సెల్ఫీలు దిగి ఇండియాకి తిరిగి వస్తుండగా లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్ దగ్గర కాసేపు ఆగారు.
అక్కడ ఫోటో తీసుకొని నేడు షేర్ చేశారు. ‘ఇక్కడే బ్రిటిష్ వారు భగత్ సింగ్‌ను ఉరివేశారు.. ఈ ప్రదేశం చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిచింది” అని మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ విషయాన్నీ చెప్పిన తర్వాత ఆ ఫొటోలోని ప్రాంతం చూసిన తర్వాత చాలామంది అదే ఫీలింగ్ కలిగింది. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.