Rajamouli: ఆర్ఆర్ఆర్ కు మళ్లీ ఖర్చు చేయాల్సిందే.. కానీ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి గతేడాది డిసెంబర్ నెలలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ తో హోరెత్తించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేశారు. అయితే సినిమా రిలీజయ్యే సమయంలో కరోనా కేసులు పెరగడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో ఆర్ఆర్ఆర్ వాయిదా ప్రకటన వెలువడింది. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ బాధ పడ్డారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత ఈ సినిమా ప్రమోషన్ల కోసం 20 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 భాషలలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా దర్శకుడు రాజమౌళి మళ్లీ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో రాజమౌళి మార్చి 18 లేదా ఏప్రిల్ 28 తేదీలలో ఏదో ఒక తేదీకి ఫిక్స్ కానున్నారని సమాచారం. బాహుబలి2 విడుదలైన ఏప్రిల్ 28వ తేదీనే ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి ప్రమోషన్స్ లో సినిమాకు సంబంధించిన విషయాలు రివీల్ కాకుండా జాగ్రత్త పడనున్నారని సమాచారం.

మరోవైపు ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల నిర్మాత దానయ్యపై ఊహించని స్థాయిలో భారం పెరిగిందని బోగట్టా. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దానయ్య 20 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయలు మళ్లీ ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం ఉండటంతో నిర్మాతకు ఆ విధంగా ప్లస్ కానుంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన రెండు వారాల వరకు పెద్ద సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించరని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత కలెక్షన్లపరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ హక్కులను బయ్యర్లు రికార్డు స్థాయి రేటుకు విక్రయించారని తెలుస్తోంది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా ఆర్ఆర్ఆర్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus