Rajamouli: ట్రైలర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చినట్టే!

గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైంది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ ను, కొమురం భీమ్ గెటప్ లో తారక్ ను చూసిన ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఉంది. మరోవైపు కొన్నిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

స్వయంగా రాజమౌళి వివరణ ఇచ్చినా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో అటు రామ్ చరణ్ కు, ఇటు ఎన్టీఆర్ కు సమాన ప్రాధాన్యత దక్కింది. ట్రైలర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా ఇద్దరు హీరోలను జక్కన్న అద్భుతంగా చూపించారని క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ లో ఎలివేషన్ షాట్స్ అద్బుతంగా ఉన్నాయి. అభిమానులు సాధారణంగా తారక్ ను టైగర్ అని పిలుస్తారు. పులికి ధీటుగా ఎన్టీఆర్ గాండ్రించే సీన్ ట్రైలర్ కే హైలెట్ అయింది.

ట్రైలర్ లో అగ్గి మంటల మధ్య చరణ్ సీతారామరాజు గెటప్ లో వచ్చే సీన్ ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus