The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

గతకొన్ని రోజులుగా ఇటు బాలీవుడ్‌లో, అటు టాలీవుడ్‌లో ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలా అని అదేమీ స్టార్‌ హీరో సినిమా కాదు, అలా అని చిన్న హీరో పాన్‌ ఇండియా సినిమా కూడా కాదు. కానీ ఆ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ వస్తుంది అంటే తెగ వెయిట్‌ చేశారు. సౌత్‌లో ఆ ట్రైలర్‌ గురించి వెయిట్‌ చేసినవారికి మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌. లక్ష్య హీరోగా బాలీవుడ్‌ అగ్రహీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకుడిగా తెరకెక్కించిన సిరీస్‌ అది. ఈ నెల 18న సిరీస్‌ను స్ట్రీమింగ్‌కి తీసుకురానున్నారు. రాఘవ్ జ్యూయెల్, లక్ష్య, మోనా సింగ్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

‘బాలీవుడ్‌లో లెక్కలేనన్ని షేడ్స్‌ ఉన్నాయి. చూడటానికి మీరు సిద్ధమేనా’ అంటూ సిరీస్‌ గురించి నెట్‌ఫ్లిక్స్‌ క్యాప్షన్‌ ఇచ్చి సిరీస్‌ మీద ఆసక్తిని మరింత పెంచింది. హిందీ చిత్రపరిశ్రమ ప్రయాణం ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌లో చాలా ఆసక్తికర సంభాషణలు, హిందీ తారల ఎంట్రీలు ఉన్నాయి. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి అతిథి పాత్ర హైలైట్‌ అని చెప్పొచ్చు. ఆయన కాకుండా సౌత్‌ నుండి ఇంకే హీరో కూడా లేరు. ఇక బాలీవుడ్‌ నుండి షారుఖ్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ రణ్‌వీర్‌ సింగ్, బాబీ డియోల్‌, దిశా పటానీ, బాద్‌షా, కరణ్‌ జోహార్‌ కనిపించారు.

బాలీవుడ్ సినిమాల అవకాశాలు, కథలు, వ్యక్తిగత జీవితాలు.. ఇలా చాలా అంశాలను ఈ సిరీస్‌లో పొందుపరిచాడు ఆర్యన్‌ ఖాన్‌. స్టార్ పవర్‌తో ఇలాంటి కంటెంట్‌ సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. మరి ఆర్యన్‌ ఎలా హ్యాండిల్‌ చేశాడు అనేదే ఇక్కడ ఆసక్తికరం. అయితే షారుఖ్‌ – సల్మాన్ ఖాన్‌ – అమీర్ ఈ సిరీస్‌లో కనిపిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. అయితే సల్లూ భాయ్‌ ట్రైలర్‌లో కనిపించలేదు. మరి సిరీస్‌లో సర్‌ప్రైజ్‌గా చూపిస్తారేమో చూడాలి.

స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus