రామ్‌చరణ్ సినిమాల్లో ఉండేదానికి బయట ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటుంటారు. సినిమాల్లో చాలా గుంభనంగా కనిపించే పాత్రలు చేసే చరణ్.. బయట చాలా సరదాగా ఉంటాడు. తన స్నేహితులతో, దగ్గరివారితో చాలా సరదాగా ఉంటాడు. అలాంటి ఓ సంఘటనను ‘మిరాయ్’ హీరో తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. కొత్త సినిమా ప్రచారంలో భాగంగా తేజ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్ చేసిన ఓ సరదా పని గురించి మాట్లాడాడు.
బాల నటుడిగా వరుస సినిమాల్లో నటించడంతో తేజ సజ్జాకు ఇప్పటి సీనియర్ స్టార్ హీరోలతో మంచి పరిచయమే ఉంది. ఈ క్రమంలో చిరంజీవితోనే కాదు తనయుడు రామ్‌చరణ్‌తో కూడా మంచి అనుబంధం ఉందట. చరణ్, తాను బయట ఎప్పుడూ కలసి కనిపించలేదు కానీ.. తమ మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపాడు. చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని చెప్పిన తేజ ‘హనుమాన్’ సినిమా షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి 12.30కి తనకు ఒక కాల్ వచ్చిందని.. ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారని చెప్పి ఫోన్ అతను ఇచ్చాడట. ఆ ప్రాంక్ కాల్ చరణే కాల్ చేశాడని తేజ చెప్పుకొచ్చాడు. అయితే ఏం మాట్లాడాడు అనే విషయం మాత్రం చెప్పలేదు తేజ. నేను చిన్నప్పుడు నుండి గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. చిరంజీవి ఎప్పుడూ నన్ను సొంత పిల్లాడిలా చూసుకున్నారు. ‘హనుమాన్’ చూశాక ఫోన్ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. కొన్ని సూచనలు చేశారని తేజ చెప్పాడు.
‘చూడాలని ఉంది’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌ల కోసం వందల ఫొటోలు వచ్చాయి. వాటిలో నుండి చిరంజీవి నన్ను సెలెక్ట్ చేశారు. ఆ రోజు ఆయన ఫొటో సెలక్ట్ చేయకపోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పాడు. సూపర్ యోధుడిగా తేజ సజ్జాను కార్తిక్ ఘట్టమనేని సిద్ధం చేశాడు. ‘మిరాయ్’గా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.